అక్కినేని అఖిల్ హీరోగా నటించిన నాలుగు సినిమాలలో ఏ సినిమా కూడా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించలేదనే సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా అఖిల్ నటించిన మూడు సినిమాలు నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. భారీ బ్లాక్ బస్టర్ సాధించాలనే అఖిల్ కల ఇప్పటికీ నెరవేరలేదు. అయితే అఖిల్ ఏజెంట్ మూవీ బడ్జెట్ అంచనాలకు మించి పెరిగిందని బోగట్టా. అఖిల్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాలో నటిస్తుండగా సురేందర్ రెడ్డి కూడా మొదట రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని భావించారు.
అయితే సురేందర్ రెడ్డి ప్రస్తుతం నిర్ణయాన్ని మార్చుకున్నారని తన రెమ్యునరేషన్ తనకు ఇచ్చేయాలని ఆయన కోరుతున్నారని సమాచారం. కరోనా వల్ల ఈ సినిమాపై బడ్జెట్ భారం పెరిగిందని తెలుస్తోంది. అఖిల్ చేతిలో ప్రస్తుతం ఈ సినిమా మినహా మరో సినిమా లేదు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రొడక్షన్ టీమ్ కు మధ్య దూరం పెరిగిందని సమాచారం. వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి సురేందర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నాగార్జున ఈ ప్రాజెక్ట్ విషయంలో జోక్యం చేసుకుంటే మంచిదని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సైతం మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కినేని అఖిల్ కెరీర్ సజావుగా సాగడం లేదని ఆయన అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏజెంట్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది.
అఖిల్ అభిమానులు మాత్రం ప్రస్తుతం ఏజెంట్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!