కొత్త కాంబినేషన్: అఖిల్ – బోయపాటి

అఖిల్ తెరమీదికొచ్చి ఏడాది కావస్తోంది. ఆ సినిమా ఫలితంతోపాటు తర్వాతి ప్రయత్నాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలిసిందే. నాగ్ వంశీ పైడిపల్లితో మంతనాలు జరపడం దగ్గర్నుంచి హను రాఘవపూడితో సినిమా అంటూ అఖిల్ ట్వీట్ చేసేవరకు రకరకాల చర్చలు జరిగాయి. అయితే అవేవీ సఫలం కాకపోగా చివరికి అక్కినేని కుటుంబానికి ‘మనం’ లాంటి మ్యాజికల్ సినిమానిచ్చిన విక్రమ్ కె కుమార్ అఖిల్ రెండో సినిమా దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు.

విక్రమ్ పెళ్ళి రూపేణా ఈ సినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో ఈ గ్యాప్ లో అఖిల్ మూడో సినిమా ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందులో భాగంగా యువ హీరోలతో హిట్ కొట్టాలని చూస్తోన్న బోయపాటితో చర్చలు జరిగాయని గుసగుసలు. దాదాపు ఖాయమని వినికిడి. తన సినిమాలన్నీ మాస్.. ఊరమాస్ శైలిలో ఉండాలనుకునే బోయపాటి ఈ సినిమా కోసం సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నారని తెలియవస్తోంది. అయితే ప్రస్తుతం బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. విక్రమ్-అఖిల్ సినిమా అయ్యేలోపు బోయపాటి మేటర్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus