మూడో సినిమా టైటిల్ పై స్పందించిన అఖిల్!

అక్కినేని కుటుంబం అంటేనే మొదటగా అద్భుతమైన ప్రేమ కథలు గుర్తుకు వస్తాయి. ప్రేమ కథ హ్యాపీ ఎండింగ్ అయినా.. విచారంతో ముగిసినా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం అక్కినేని హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున.. నాగచైతన్యకి సాధ్యమయ్యాయి. ఆ బాటలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అఖిల్ భావిస్తున్నారు. అందుకే తొలి ప్రేమ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకొని లండన్లో షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. అఖిల్ టీమ్ ఈ నెల చివరి వారంలో లండన్ కి వెళ్లనుంది. అక్కడే మేజర్ పార్ట్ పూర్తి చేయనున్నారు.

ఈ చిత్రానికి నాగార్జున హిట్ మూవీ మజ్ను అనే పేరుని ఫిక్స్ చేసినట్లు వార్తలు రెండు రోజులుగా గుప్పుమన్నాయి. మిస్టర్ మజ్ను అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు చక్కర్లు కొట్టింది. దీనిపై అఖిల్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. “నా గత రెండు చిత్రాలకు విభిన్నంగా నా మూడో సినిమా ఉండబోతోంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్నాను. దీనికి మజ్ను అని పేరు అనుకున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంకా టైటిల్ అనుకోలేదు. మజ్ను అనే పేరు మాత్రం ఈ కథకు పెట్టము” అని స్పష్టం చేశారు.  బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చే పనిలో ఎస్ఎస్ థమన్ ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus