Akhil: క్రికెటర్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన అఖిల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ఏకైక హీరో అఖిల్ అక్కినేని. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. విడుదలకు ముందు హైప్ బాగానే క్రియేట్ చేస్తున్న అఖిల్ సినిమా రిలీజ్ అనంతరం మాత్రం ఒక్కసారిగా డౌన్ అవుతున్నాడు. ఇక ఈసారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టాలని రెడీ అవుతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అఖిల్ ఒక స్టార్ క్రికెటర్ బయోపిక్ పై ఫోకస్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

అఖిల్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో చాలాసార్లు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ లో సిక్సర్ల వర్షంతో అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు. అసలైతే అఖిల్ క్రికెటర్ అవ్వాలని మొదటి నుంచి ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఇక అఖిక్ మొత్తానికి తన డ్రీమ్ క్రికెటర్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చాడు.. ‘భవిష్యత్తులో ఎప్పటికైనా ఒక మంచి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో బయోపిక్ చేయాలని ఉంది.

ముఖ్యంగా విరాట్ కోహ్లీ బయోపిక్ అయితే తప్పకుండా చేస్తాను. అతని ఆట తీరు ఫ్యాషన్, నిబద్ధత, ఫైర్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చాలా విషయాల్లో అతను నన్ను ప్రభావితం చేశాడు. సరైన స్క్రిప్ట్ సెట్ చేయగలిగితే తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని అఖిల్ వివరణ ఇచ్చారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus