అఖిల్ కు జోడీగా ‘గీతగోవిందం’ బ్యూటీ ?

అక్కినేని అఖిల్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘జిఏ2’ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది అఖిల్ కు నాలుగవ సినిమా. సినిమా అయితే మొదలైంది కానీ ఈ చిత్రంలో నటీనటులను ఇంకా ఫైనల్ చేయలేదు. ముఖ్యంగా హీరోయిన్ విషయం అస్సలు తేలడం లేదు. కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.

ముందు మొదటి హీరోయిన్ గా కైరా అద్వానీని.. అలాగే రెండవ హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. తావువాత పూజా హెగ్దే ను తీసుకోవాలనుకున్నారు.కానీ ఆమె కాల్షీట్లు అస్సలు ఖాళీ లేవని చెప్పి డ్రాప్ అయ్యిందట. దీంతో ‘గీత గోవిందం’ బ్యూటీ రష్మిక మందన ను ఫైనల్ చేసినట్టు టాక్ నడుస్తుంది. అయితే ఆమె స్క్రిప్ట్ పై కాస్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

‘గీతా ఆర్ట్స్’ వంటి సక్సెస్ఫుల్ బ్యానర్లో ఓ ప్రాజక్ట్ ను పట్టాలెక్కుతుందంటే.. సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ అఖిల్ కు ఒక్క హిట్టు కూడా లేకపోవడం .. భాస్కర్ కూడా డైరెక్షన్ కు దూరంగా ఉంటూ రావడం చూసి నటీమణులు వెనుకడుగేస్తూ వస్తున్నారని సమాచారం. అయితే పరశురాం లాంటి డైరెక్టర్ కూడా చాలా గ్యాప్ తర్వాత వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. మరి భాస్కర్ కొట్టలేడా అని ఫిలింనగర్లో చెప్పుకొస్తున్నారు. సో రష్మిక ఈ విషయాన్ని గుర్తుచేసుకుని ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేస్తే ప్రాజెక్ట్ చక చకా పరుగులు తీయడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus