బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో సీనియర్స్ కంటెస్టెంట్స్ మద్యలో గట్టిగా లొల్లి అయ్యింది. ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ యాక్టివ్ గా పాల్గొన్నారు. రైనింగ్ లైక్స్ అనే టాస్క్ లో గాల్లో నుంచీ వచ్చే లైక్స్ ని సంపాదించి వాటిని జాగ్రత్త పరుచుకోవాలి. ప్రతి రౌండ్ లో బిగ్ బాస్ అడినపుడు కౌంటింగ్ చెప్పాలి. దీని ఆధారంగా ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వాళ్లని బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల నుంచీ తప్పిస్తాడు.
ఇక్కడే హమీదాకి ఇంకా అఖిల్ కి గట్టిగా పడింది. ఇద్దరూ ఆర్గ్యూమెంట్ చేసుకున్నారు. ఫస్ట్ హమీదా పట్టుకున్న లైక్ బటన్ ని అఖిల్ తీస్కోబోయాడు. ఈలోగా ఇంకో లైక్ బటన్ గాల్లో నుంచీ పడగానే దానిపైన కాలు పెట్టి మరీ హోల్ట్ చేసింది హమీదా. కానీ తన కాలుని పైకి లేపి మరీ లైక్ బటన్ ని అఖిల్ తీసుకున్నాడు. దీంతో హమీదా అబ్జక్ట్ చేసింది. నువ్వు నా కాలు తొడ పట్టుకుని లేపి మరీ తీసుకోవడం కరెక్ట్ కాదని వాదించింది.
అంతైకాదు, నా తొడని పట్టుకుని పైకి లేపావ్ అంటూ మాట్లాడేసరికి అఖిల్ సీరియస్ అయ్యాడు. నేను అలా చేయను అని నాకు అలాంటి ఉద్దేశ్యం ఉండదని క్లియర్ గా చెప్పాడు. ఆ తర్వాత హమీదా అఖిల్ విషయంలో బాగా అప్సెడ్ అయ్యింది. నిజానికి అంతకుముందే స్మిమ్మింగ్ పూల్ లో మైక్ తో సహా దూకినందుకు హమీదా దగ్గరున్న లైక్ బటన్స్ అన్నీ బిగ్ బాస్ లాగేసుకున్నాడు. అసలే బాధలో ఉన్న హమీదాని అఖిల్ ఎటాక్ చేసినట్లుగా అయ్యింది.
అందుకే హమీదా బాధపడింది. ఇక హమీదా బాధపడుతుంటే మద్యలో వచ్చిన సరయు కొన్ని డైలాగ్స్ వేసింది. కానీ హమీదా ఎక్కడా నోరుజారలేదు. తను అనుకున్న పాయంట్ ని మాత్రమే సూటిగా అఖిల్ తో చెప్పింది. అఖిల్ మళ్లీ తిరిగి లైక్ బటన్ ఇచ్చేస్తున్నా తీసుకోలేదు హమీదా. మళ్లీ నేను కష్టపడి గేమ్ ఆడతానని కాన్ఫిడెంట్ గా చెప్పింది. మహేష్ విట్టా, హమీదా, సరయు ముగ్గురూ కలిసి గేమ్ ఆడుతున్నా కూడా హమీదా మాత్రం తను ఇండిపెండెంట్ గానే గేమ్ ఆడతాని నా దగ్గరున్న లైక్ బటన్స్ ని మాత్రమే కౌంట్ చేస్తానని క్లియర్ గా చెప్పింది.
ఇక్కడ తన కాన్ఫిడెన్స్ లెవల్స్ , గేమ్ పైన ఉన్న అవగాహన, సరయు విషయంలో వెంటనే స్పందించిన తీరు సూపర్ గా ఉన్నాయి. మరి ఈ గేమ్ లో హమీదా కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.