నిన్న అంటే ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ పుట్టినరోజు. దాంతో మెగా ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా ద్వారా అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. కాగా తాజాగా ఇతను కూడా ఇతని తండ్రి పవన్ కళ్యాణ్ లానే పంచె కట్టుకుని ప్రత్యక్షమవ్వడం అభిమానులను సర్ప్రైజ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల తన కొడుకు, కూతురుతో కలిసి తిరుమల వెళ్ళి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది.
ఆ సందర్భంలో అకీరా పంచె కట్టుకున్నాడట.ఇక దర్శనం అనంతరం వాళ్ళు తిరిగి హోటల్ కి వచ్చి యుండగా.. ఆ గ్యాప్ లో అకీరాకి ఓ సందేహం వచ్చిందట.అదేంటంటే.. ‘ఆడవాళ్ళు రోజూ చీరలు కట్టుకున్నట్టు గానే.. మగవాళ్ళు కూడా పంచె లేదా లుంగీ ఎందుకు కట్టుకోరు అని? అకీరా ప్రశ్నకి ఓ పక్కన ఆనంద పడుతూనే మరోపక్క అతనికి ఇంత మంచి ఆలోచనతో కూడిన డౌట్ ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయిందట రేణు.ఆ తరువాత ఆమె తన కొడుకుతో..
‘అది మైండ్ సెట్ కు సంబంధించినది… కంఫర్ట్ ను బట్టి ఏదైనా కట్టుకోవచ్చు’ అని సమాధానం ఇచ్చిందట. అప్పటినుండీ జీన్స్, షార్ట్స్ తో పాటు.. అప్పుడప్పుడు పంచలు కూడా కట్టుకుంటున్నాడట మన జూనియర్ పవర్ స్టార్. ఇక అకీరా పంచె కట్టుకొని ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. మరో పక్క తన తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈరోజు విడుదల కాబోతుంది.