Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • October 31, 2026 / 11:29 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • కీర్తి సురేష్‌ (Heroine)
  • రాధిక ఆప్టే, త‌న్వీ ఆజ్మీ, అంజ‌లి పాటిల్‌, పూర్ణిమ ఇంద్ర‌జీత్ త‌దిత‌రులు (Cast)
  • ధ‌ర్మ‌రాజ్ శెట్టి (Director)
  • ఆదిత్య చోప్రా (Producer)
  • జాన్ స్టీవ‌ర్ట్ (Music)
  • ప్ర‌తీక్ షా (Cinematography)
  • సంయుక్త క‌జా (Editor)
  • Release Date : 30th అక్టోబ‌ర్‌ 2026
  • వైఆర్ఎఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ (Banner)

సౌత్ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్న కీర్తి సురేష్ “అక్క” (Akka) వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌ డ్రామాగా తెర‌కెక్కినఈ హిందీ సిరీస్‌ను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రాధికా ఆప్టే కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సిరీస్‌కు ధ‌ర్మ‌రాజ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్క వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్ ఆడియెన్స్‌ను కీర్తి సురేష్ మెప్పించింది? గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ఆమె న‌ట‌న ఎలా ఉందంటే?

Akka Review

Akka Web-Series Review and Rating

క‌థ‌: పేర్నూరు ప్రాంతాన్ని వంద‌ల ఏళ్ల నుంచి మ‌హిళ‌లే పాలిస్తుంటారు. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత పేర్నూరు ఇండియాలో విలీన‌మైన మ‌హిళ‌ల ఆధిప‌త్యం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది. సింహాస‌నాన్ని అదిష్టించే రాణిల‌ను అక్క అని పిలుస్తుంటారు. పేర్నూర్‌ను మూడు రాజ్యాలుగా విభ‌జిస్తారు. అందులో మ‌లేమార్‌కు కాబోయే రాణిగా భ‌వానీని (Keerthy Suresh) ప్ర‌క‌టిస్తారు. లిక్క‌ర్ దందాతో పాటు బంగారం వ్యాపారాలు చేస్తుంటుంది భ‌వానీ. త‌న అధికారానికి ఎదురొచ్చిన వారిని దారుణంగా చంపేస్తుంటుంది. ముంబాయి నుంచి పేర్నూరుకు రుద్ర (Radhika Apte) వ‌స్తుంది.

భ‌వానీతో పాటు ఇత‌ర రాజ్యాల‌కు చెందిన అక్క‌ల‌ ఆధిప‌త్యం, వారి వ్యాపారాల‌ను కూల్చేయ‌డం మొద‌లుపెడుతుంది. భ‌వానీని జైలుకు పంపిస్తుంది. అస‌లు రుద్ర ఎవ‌రు? అక్క‌ల వంశాన్ని నాశ‌నం చేయాల‌ని ప‌గ‌తో రుద్ర ర‌గిలిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? భ‌వానీ ప్రేమించిన నంద, రుద్ర‌కు ఉన్న సంబంధ‌మేమిటి? రుద్ర బారి నుంచి త‌న వంశాన్ని కాపాడుకోవ‌డానికి భ‌వానీ ఏం చేసింది? ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో సాగిన ఈ పోరులో ఎవ‌రు గెలిచారు? అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

Akka Web-Series Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: అక్క వెబ్‌సిరీస్‌కు కీర్తి సురేష్ (Keerthy Suresh) సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. లేడీ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో జీవించింది. ఆమె బాడీలాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉన్నాయి. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మెప్పించింది. స్క్రీన్‌పై భ‌వానీ అనే క్యారెక్ట‌ర్ త‌ప్ప కీర్తి సురేష్ ఎక్క‌డ క‌నిపించ‌లేదు. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో కీర్తి సురేష్‌కు ధీటుగా రాధికా ఆప్టే క‌నిపించింది. గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తూనే విల‌నిజాన్ని పండించింది. వీరిద్ద‌రి పాత్ర‌ల ప్ర‌ధానంగానే ఈ సిరీస్ సాగింది. పూజ మోహ‌న్‌రాజ్ యాక్ష‌న్ సీన్ల‌లో ఆక‌ట్టుకుంది. రాధికా ఆప్టేకు జోడీగా అన్షుమ‌న్ పుష్క‌ర్ విల‌న్ పాత్ర బాగా సెట్ట‌య్యాడు. త‌న్వీ ఆజ్మీ, పూర్ణిమ ఇంద్ర‌జీత్‌, విశాఖ్ నాయ‌క్‌, అంజ‌లి పాటిల్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

Akka Web-Series Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: అక్క వెబ్‌సిరీస్ కోసం డైరెక్ట‌ర్ ధ‌ర్మ‌రాజ్‌ శెట్టి కొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేశారు. మాతృస్వామ్య వ్య‌వ‌స్థ, కాబోయే రాణుల‌ను అక్క అని పిల‌వ‌డం, సింహాస‌నాన్ని ఆదిష్టించాలంటే కొన్ని రూల్స్ ఇవ‌న్నీ బాగా రాసుకున్నారు. పేర్నూర్ ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసిన తీరు ఆస‌క్తిని పంచుతుంది. ఏదో వెరైటీ కాన్సెప్ట్ చూడ‌బోతున్నామ‌నే ఊహ‌ను ఆడియెన్స్‌లో క‌లిగిస్తుంది. అస‌లైన మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ లో మాత్రం ఆ ఫ్రెష్‌నెస్ మిస్స‌య్యింది.

రొటీన్ రివేంజ్ డ్రామా చుట్టూనే మిగిలిన క‌థను అల్లుకున్నారు. లేడీ గ్యాంగ్‌స్ట‌ర్ల ప్ర‌పంచంలోకి ఓ యువ‌తి అడుగుపెట్ట‌డం, భ‌వానీకి వ్య‌తిరేకంగా కుట్ర‌లు ప‌న్న‌డం, ఆ మ‌హిళ‌కు ఓ ఫ్లాష్‌బ్యాక్‌, త‌న‌కు జ‌రిగిన అన్యాయం కోసమే ఇదంతా చేస్తుంద‌న్న‌ట్లుగా చూపించారు. క‌ష్టాలు, అడ్డంకులు దాటుకొని చివ‌ర‌లో హీరోయిన్ గెలిచిన‌ట్లుగా చూపించి ఎండ్ చేశారు. భ‌వానీ, రుల‌ద్ర ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తుల్లో థ్రిల్లింగ్ మిస్స‌య్యింది.

టెక్నిక‌ల్‌గా మాత్రం అక్క వెబ్‌సిరీస్ టాప్ నాచ్‌లో ఉంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ ఎస్సెట్‌గా నిలిచాయి. భారీ బ‌డ్జెట్‌తో య‌శ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. ప్ర‌తి ఫ్రేమ్‌లో ఆ క్వాలిటీ క‌నిపిస్తుంది. ప్ర‌తీక్ షా సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సిరీస్ మొత్తం డార్క్ మోడ్‌లో సాగుతుంది. క‌ల‌ర్‌టోన్ డిఫ‌రెంట్‌గా అనిపిస్తుంది. షీత‌ల్ ఇక్బాల్ శ‌ర్మ కాస్ట్యూమ్స్‌, జాన్ స్టీవ‌ర్ట్ మ్యూజిక్ క‌థ‌లోని లీన‌మ‌య్యేలా తోడ్ప‌డ్డాయి. ఐదు ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 30 నుంచి న‌ల‌భై ఐదు నిమిషాల వ‌ర‌కు ఉన్నాయి. తెలుగు డ‌బ్బింగ్ కూడా బాగుంది.

Akka Web-Series Review and Rating

విశ్లేష‌ణ: సినిమా ఇండ‌స్ట్రీ హీరోల చుట్టూనే తిరుగుతుంది. సినిమా, సిరీస్ ఏదైనా హీరో పాత్ర ప్ర‌ధానంగానే సాగుతుంటాయి. ఈ ట్రెండ్‌కు భిన్నంగా వ‌చ్చిన వెబ్‌సిరీస్ అక్క‌. ఇందులో ప్ర‌త్యేకంగా హీరో అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అన్ని కీల‌క పాత్ర‌ల్లో మ‌హిళ‌లే క‌నిపిస్తారు. ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, సెంటిమెంట్ కూడా వారి పాత్ర‌ల చుట్టే తిరుగుతుంది. ఒక ర‌కంగా వెరైటీ ప్ర‌యోగ‌మే. క‌థ విష‌యంలో ఇదే కొత్త‌ద‌నం ఉండుంటే అక్క మ‌రో లెవెల్‌లో ఉండేది.

ఇలాంటి రివేంజ్ ఫార్ములా క‌థ‌లు టాలీవుడ్‌, బాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం ఉంచి ఈ క‌థ‌ల‌తో చాలా సినిమాలు వ‌చ్చాయి. కీర్తి సురేష్‌, (Keerthy Suresh) రాధికా ఆప్టే (Radhika Apte) యాక్టింగ్‌, టెక్నిక‌ల్ వాల్యూస్ కోసం ఈ సిరీస్‌ను చూడొచ్చు.

Akka Web-Series Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: కీర్తి సురేష్ కెరీర్‌లో ఓ వెరైటీ ప్ర‌యోగం.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AKKA
  • #keerthy suresh
  • #Radhika Apte
  • #Tanvi Azmi

Reviews

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

54 mins ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

2 days ago

latest news

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

5 seconds ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

21 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

23 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

2 days ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version