Samantha: సినిమాల కోసం సానుభూతి మంత్రం.. సమంతపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో చైతన్య సమంత జోడీ ఒకటి కాగా ఈ జోడీ విడిపోయి అందరికీ షాకిచ్చింది. రీజన్స్ చెప్పకపోయినా ఈగో సమస్యల వల్లే వీళ్లిద్దరూ విడిపోయారని అందరూ భావిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువగా సానుభూతి మంత్రాన్ని ఉపయోగిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చైతన్యపై సమంత ఇన్ డైరెక్ట్ గా ఆరోపణలు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. వివాహ బంధానికి సంబంధించి, విడాకులకు సంబంధించి తనే తప్పు చేయలేదని సమంత చెబుతున్నారు.

ఈ కామెంట్ల ద్వారా సమంత పరోక్షంగా తప్పంతా నాగచైతన్యదే అని చెప్పకనే చెబుతున్నారు. నాగచైతన్య ఇప్పటివరకు సమంత గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదనే సంగతి తెలిసిందే. చైతన్య సమంత విడిపోవడానికి గల కారణాలు చెప్పకుండా నిందించుకోవడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. యశోద సినిమా సమయంలో సమంత మయోసైటిస్ వల్ల తనకు ఎదురైన ఇబ్బందులను చెప్పి సానుభూతిని పొందే ప్రయత్నం చేశారని ఇప్పుడు నాగచైతన్యపై పరోక్షంగా నింద వేయడం ద్వారా సానుభూతి పొంది శాకుంతలం సక్సెస్ సాధించేలా సమంత అడుగులు వేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ కామెంట్ల విషయంలో సమంత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సమంత పారితోషికం ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సమంత ఫ్యాన్స్ మాత్రం సినిమాల పబ్లిసిటీ కోసం సమంత ఈ విధంగా చేయరని చెబుతున్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు ఖుషి సినిమాలో నటిస్తుండగా ఈ రెండు ఎప్పుడు విడుదలవుతాయో చూడాల్సి ఉంది.

సమంత కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా అడుగులు వేస్తుండటం గమనార్హం. సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ల దిశగా అడుగులు వేస్తున్నారు. కెరీర్ పరంగా సమంతకు మరిన్ని విజయాలు దక్కాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus