ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా అక్కినేని హీరో !

“ప్రస్తుతం తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. ఈ చిత్రం అనేక అడ్డంకులను అధిగమించి సెట్స్ మీదకు వెళ్ళింది. మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మహానటుడు భార్య బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కనిపించనుంది. అలాగే కైకాల సత్యనారాయణ, నరేష్, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగా రానా రీసెంట్ గా ఒకే చెప్పారు. తాజాగా ఇందులో ఏఎన్నార్ గా సుమంత్ ని ఎంపిక చేసినట్లు క్రిష్ ట్వీట్ చేశారు. అక్కినేని పాత్రను నాగచైతన్య చేయనున్నట్టు మొదట్లో ప్రచారం జరిగింది.

“ఆ తర్వాత నాగచైతన్య కాదు.. సుమంత్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఆ తర్వాత ఎవరో కొత్త ఆర్టిస్ట్ అక్కినేని పోషించనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలకు ఈరోజుతో ఫుల్‌స్టాఫ్ పడింది. “గొప్ప సినిమాలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. మా తాతగారు ఏఎన్నార్ రోల్ ని పోషించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని సుమంత్ రీ ట్వీట్ చేశారు. భారీ తారాగణం తో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus