సోనాలి బింద్రేకి అండగా నిలిచిన స్టార్ హీరోలు

బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే హిందీలోనే కాకుండా తెలుగులోనూ గొప్ప విజయాలను అందుకుంది. మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పెళ్లిచేసుకొని భర్త, పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఆమె జీవితంలోకి క్యాన్సర్ మహమ్మారి వచ్చింది. ఆమె హై గ్రేడ్ క్యాన్సర్ బారిన పడినట్లు తాజా పరీక్షల్లో బయటపడింది. నిన్న ఆ విషయాన్ని దైర్యంగా బయటపెట్టి చికిత్స నిమిత్తం న్యూయార్క్ కి వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న స్టార్ హీరోలు ఆమెకు మరింత ధైర్యాన్ని అందిస్తున్నారు. “కింగ్‌” నాగార్జున సొనాలీ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. “నువ్వు త్వరగా కోలుకోవాలని, నీ ఆత్మవిశ్వాసానికి మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నా డియర్‌” అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

ఇక బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అయితే ఆమెను కలిసి దైర్యం చెప్పారు. అనంతరం ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” సోనాలి ధైర్యంగా పోరాడుతుందని నాకు తెలుసు. దేవుడి దీవెనలతో మంచి ఆరోగ్యంతో ఆమె తిరిగి వస్తుంది” అని వెల్లడించారు. అలాగే సోనాలి మరదలు సృష్టి ఆర్య స్పందించారు. ”సోనాలి క్యాన్సర్ విషయం సడెన్‌గా జరిగిపోయింది. సోనాలి క్యాన్సర్‌ను జయిస్తుందన్న నమ్మకం మాకు ఉంది. సోనాలి ఒక ఫైటర్. తను తప్పనిసరిగా జయిస్తుంది. ఆమెకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆమె త్వరలోనే క్యాన్సర్‌ను నివారించుకుని తిరిగొస్తుంది” అని చెప్పుకొచ్చారు. సోనాలి అభిమానులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus