రికార్డులు క్రియేట్ చేస్తున్న అక్షయ్ కుమార్..!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పెద్ద సినిమాలు తీయాలని సంవత్సరాలు.. సంవత్సరాలు ఎదురుచూడదు. మంచి కథాంశం ఉన్న స్క్రిప్టులను ఎంచుకుంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వరుస సినిమాలు చేస్తుంటాడు. బాలీవుడ్ స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లలాగా రెండేళ్ళ వరకూ ఒకే సినిమా చేస్తూ ఉండిపోకుండా వరుస చిత్రాలు చేస్తూ… అందులోనూ అన్నీ విజయవంతమైన చిత్రాల్ని చేస్తూ దూసుకుపోతుంటాడు. తాజా ఆయన నటించిన ‘కేసరి’ చిత్రంతో 11 వసారి 100 కోట్ల క్లబ్ లో చేరి కొత్త రికార్డు సృష్టించాడు.

ఇటీవల విడుదలైన ‘కేసరి’ చిత్రం మొదటి షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండడం విశేషం. కేవలం మొదటి 7రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు ఈ ఏడాది తక్కువ సమయంలో 100 కోట్లను రాబట్టిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. 1897 లో జరిగిన సారాగడి యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. పరిణీతి చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేశాడు.మరి ముందు ముందు ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus