Akshay Kumar: ఆ సింగర్ కు అక్షయ్ కుమార్ చేసిన సహాయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండటంతో పాటు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. అక్షయ్ కుమార్ కు సౌత్ ఇండియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం తెలుగులో కన్నప్ప సినిమాలో అక్షయ్ నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అక్షయ్ కుమార్ తను చేసే సేవా కార్యక్రమాల ద్వారా పలు సందర్భాల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు. ప్రముఖ సింగర్ పద్మ భూషణ్ అవార్డు గ్రహిత సింగర్ గుర్మీత్ బవా కూతురు గ్లోరీ బవా ఆర్థిక కష్టాల్లో ఉన్నారని తెలిసి అక్షయ్ కుమార్ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని తెలుస్తోంది. తల్లి మరణం తర్వాత తాను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని గ్లోరీ బవా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

తల్లిలా గ్లోరీ కూడా సింగర్ కావడంతో ఆమె చేసిన కామెంట్లు వేగంగా వైరల్ అయ్యాయి. ఈ విషయం అక్షయ్ కుమార్ దృష్టికి రాగా వెంటనే రెస్పాండ్ కావడంతో పాటు తన వంతు సహాయం చేశారు. సోషల్ మీడియా ద్వారా గుర్మీత్ బవా కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసిందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. పంజాబ్ లోని ప్రముఖ గాయనిలలో గుర్మీత్ బవా ఒకరని ఆయన వెల్లడించారు.

నేను కూడా గుర్మీత్ బవా పాటలు పాడేవాడినని ఆయన పేర్కొన్నారు. ఆమె కూతురు ఇబ్బందుల్లో ఉందని తెలిసి బాధ పడ్డానని అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఒక అన్నగా గ్లోరీ బవాకు సాయం చేశానని గుర్మీత్ బవా పేర్కొన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus