7 వ వారం లోకి ఎంటర్ అయ్యింది ‘అల వైకుంఠపురములో’. గతవారం వరకూ వీకెండ్ లను కూడా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం ఈవారం ‘భీష్మ’ ఎంట్రీ తో కాస్త తగ్గినట్టే తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యి ఎన్నో రికార్డులని క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రాలకు సైతం సాధ్యంకాని కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టింది. సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచింది. ఎన్ని చిత్రాలు వచ్చినా ఈ చిత్రం హవా తగ్గలేదు.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 43 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 44.80 cr |
సీడెడ్ | 18.24 cr |
ఉత్తరాంధ్ర | 19.88 cr |
ఈస్ట్ | 11.42 cr |
వెస్ట్ | 8.94 cr |
కృష్ణా | 10.77 cr |
గుంటూరు | 11.16 cr |
నెల్లూరు | 4.71 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.85 cr |
ఓవర్సీస్ | 18.35 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 160.12 cr (share) |
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 43 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…129.92 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక.. వరల్డ్ వైడ్ గా మొత్తం ..160.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 255.95 కోట్లను కొల్లగొట్టింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని అప్పట్లో ట్రేడ్ పండితులు చెప్పారు. కానీ ఆ ఫీట్ అందుకోవడం మాత్రం సాధ్యమయ్యేలా లేదు.
Click Here For Ala Vaikunthapurramloo Movie Review
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!