4వ వారంలోకి ఎంటరైనా బన్నీ బాబు స్పీడ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. మరో వారం రోజుల వరకూ ‘అల వైకుంఠపురములో’ చిత్రం… అదే జోరుని కొనసాగించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 249 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ప్రభాస్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లను రాబట్టిన హీరో ఒక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే..! మరో వారంలోపే ఈ చిత్రం 250కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 23 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 42.95 cr |
సీడెడ్ | 17.91 cr |
ఉత్తరాంధ్ర | 19.31 cr |
ఈస్ట్ | 11.09 cr |
వెస్ట్ | 8.72 cr |
కృష్ణా | 10.45 cr |
గుంటూరు | 10.84 cr |
నెల్లూరు | 4.52 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.71 cr |
ఓవర్సీస్ | 18.20 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 155.70 cr (share) |
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 23 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…125.79 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..155.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 249.08 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి నమ్మకం ఎంత వరకూ నిజమవుతుందో చూడాలి.
Click Here For Ala Vaikunthapurramloo Movie Review
Most Recommended Video
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు