అవును… ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల హవా ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ.. ఈ చిత్రం కలెక్షన్లు తగ్గడం లేదు. మార్నింగ్ షోలు, మ్యాట్నీ లు కొంచెం డల్ గా ఉంటున్నప్పటికీ.. ఈవెనింగ్ షోల నుండీ ఈ చిత్రం మళ్ళీ పుంజుకుంటూనే వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసింది.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 26 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 43.40 cr |
సీడెడ్ | 17.96 cr |
ఉత్తరాంధ్ర | 19.40 cr |
ఈస్ట్ | 11.16 cr |
వెస్ట్ | 8.76 cr |
కృష్ణా | 10.51 cr |
గుంటూరు | 10.89 cr |
నెల్లూరు | 4.56 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.74 cr |
ఓవర్సీస్ | 18.24 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 156.62 cr (share) |
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 26 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…126.64 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొత్తం ..156.62 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 250.45 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి మరో వీకెండ్ ఉంది కాబట్టి అది కూడా సాధ్యమయ్యే అవకాశం ఉందనే చెప్పాలి.
Click Here For Ala Vaikunthapurramloo Movie Review
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు