‘అల వైకుంఠపురములో’ బిజినెస్ అదిరింది..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’..! హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కాబట్టి.. అంచనాలు గట్టిగానే ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు మంచి విజయాల్ని సాధించాయి. దీంతో ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు కూడా పెద్ద హిట్ అవడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

దీంతో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుందట. ముఖ్యంగా ఈ చిత్రం హిందీ.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఏకంగా 19.5 కోట్లకు అమ్ముడయ్యాయట. ఎలాగూ బన్నీ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన బన్నీ సినిమాలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా 100 మిలియన్ వ్యూస్ పైనే నమోదవుతున్నాయి. ఇక టెలివిజన్లో ప్రదర్శిస్తున్నప్పుడు టి.ఆర్.పి ఓ రేంజ్లో వస్తుందట. అందుకే ఇంత పెద్దమొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తుంది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus