సంక్రాంతికి బన్నీ బ్ల్లాక్ బస్టర్ కొట్టేసినట్టే..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల వైకుంఠపురంలో’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాలు మంచి హిట్లయ్యాయి కాబట్టి ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలున్నాయి. ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో వీళ్ళిద్దరూ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం కథ ఇదే అంటూ కొన్ని కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

త్రివిక్రమ్ గత చిత్రాల్లానే … ‘అల వైకుంఠపురంలో’ కూడా ఓ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. రెండు కుటుంబాల మధ్య విబేధాల కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరమైన కొడుకు(హీరో) … పెద్దయ్యాక తన ఇంటికే ఓ పని వాడిగా వెళ్తాడు. ఆ తరువాత హీరో వాళ్ళకి ఎలా దగ్గరవుతాడు.. మధ్యలో ఎదురైన పరిస్థితులేంటి అనేదే కధని తెలుస్తుంది. ఈ చిత్రంలో ధనవంతుల కుటుంబం అలాగే పేద కుటుంబం ఉంటాయి.వీరి మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఇద్దరు తండ్రులు తమ కొడుకులని పుట్టినప్పుడే మార్చుకుని పెంచుకుంటారు. అలా ధనవంతుడైనా కానీ పేదవాడిగా పెరుగుతాడు హీరో, పేదవాడైనా ధనవంతుడిగా పెరిగిన మరో వ్యక్తి ఎవరు? చివరికి వీరి జీవితం ఎలా సుకాంతం అయ్యింది అనేది మిగిలిన కథని తెలుస్తుంది. ఈ చిత్రంలో తండ్రులు గా మురళీశర్మ, జయరాం నటిస్తున్నారు. సుశాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే అలనాటి గ్లామర్ నటి టబు కూడా ఓ కీలక పాత్ర చేస్తుంది. ‘అరవింద సమేత’ లో మిస్సైన త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఈ చిత్రం పుష్కలంగా ఉంటుందట. ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తుంది. మరి ఈ కథలో ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus