నిర్మాత‌గా మారిన అలీ, అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై సినీ నిర్మాణ సంస్థ ప్రారంభం!

అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి అందులో నేనుండాలి చిత్రం బుధవారం అన్న‌పూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్వి.కృష్ణా రెడ్డి,అచ్చి రెడ్డి, బోయపాటి శ్రీను, బాబీ, జీవిత రాజ‌శేఖ‌ర్, త‌నికెళ్ల భ‌ర‌ణి, హేమ‌ తదితరులు పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ద‌ర్శ‌కులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…. అలీతో నాకు మంచి సంభంధం ఉంది. అందరూబాగుండాలి అందులోనేనుండాలి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో అలీ, నరేష్ కలిసి నటిస్తుండడం సంతోషంగా ఉంది. భవిషత్తులో అలీ మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అలీ మాట్లాడుతూ… దర్శకుడు కిరణ్ నేను చెన్నై లో రూమ్ మేట్స్, మలయాళం లో జరిగిన ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాము. మ‌ళ‌యాలం బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతి సినిమాకు రీమేక్ ఇది. ఈ కథ నచ్చి వెంటనే నరేష్ గారికి ఈ సినిమా చూడమని చెప్పాను. ఆయనకు ఈ మూవీ బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. పవిత్ర లోకేష్ ఈ సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నారు. సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్ ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నారు. రాకేష్ మ్యూజిక్ భాస్కరభట్ల సాహిత్యం ఇలా అందరూ పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.

నరేష్ మాట్లాడుతూ… అలీ సినిమా చేస్తున్నాడంటే సినిమాకు ఒక బ్రాండ్ వస్తుంది. తను నేను కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాము. అందరూబాగుండాలి అందులోనేనుండాలి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా అలీ ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నాడు. దర్శకుడు శ్రీపురం కిరణ్ మంచి మార్పులు చేసి బెస్ట్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ…. అలీ గారు స్థాపించిన అలీవుడ్ బ్యానర్ లో నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. నరేష్ గారు మా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఈరోజు నుండి చిత్ర షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

హీరోయిన్ మౌర్యానీ మాట్లాడుతూ.. అలీగారంటే అంద‌రికీ అభిమాన‌మే, అలానే ఇందులో మ‌రో కీల‌క పాత్ర చేస్తున్న న‌రేశ్ గారితో క‌లిసి న‌టిస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ప్ర‌తిభావంత‌మైన‌, ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సినిమా క‌చ్ఛింత‌గా ప్రేక్ష‌కుల్ని ఆక్ట‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నాను.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus