Alia Bhatt: తెలుగు స్పీచ్ తో అదరగొట్టిన అలియాభట్!

Advertisement

ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఇక్కడ సినిమాలు చేయడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. ఎవరైనా భారీ రెమ్యునరేషన్ ఇస్తే.. షూటింగ్ చేసేసి వెళ్లిపోయేవారు. ప్రమోషన్స్ లో కూడా కనిపించేవారు కాదు. బాలీవుడ్ స్థాయిని ఏదీ మించలేదని ఫీల్ అయ్యేవారు. అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ని బీట్ చేసేసింది. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలే అసలైన పాన్ ఇండియా సినిమాలని జనాలు నమ్మే రేంజ్ కి తెలుగు సినిమాలు ఎదిగాయి.

దాంతో బాలీవుడ్ కూడా తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. తమ సినిమాలను తెలుగులో ప్రచారం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇదొక బాలీవుడ్ సినిమా కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమా అన్నట్లు ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ స్టేజ్ మీద ఉన్నారంటే.. ఆయన స్పీచ్ తో అందరినీ డామినేట్ చేసేస్తారు. కానీ ఈసారి అలియాభట్ తన మాటలతో, పాటతో అదరగొట్టింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో ఒక పాటను తెలుగులో పాడి ఆశ్చర్యపరిచింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో కూడా అలియా తెలుగులో మాట్లాడడానికి తనవంతు ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా తెలుగులో పాటే పాడేసింది. అలియా పాడిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు.

‘ఆర్ఆర్ఆర్’ తరువాత అలియా తెలుగులో సినిమాలు చేయడానికి నిరాకరిస్తుందని వార్తలొచ్చాయి. కానీ అలియా జోరు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఫ్యూచర్ లో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించే ఛాన్స్ ఉందనిపిస్తుంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus