krrish 4: డబ్బులు రెడీ.. కథ రెడీ.. హీరో రెడీ అయితే మూడో సీక్వెట్‌ షురూ!

బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్న సిరీసుల్లో ‘క్రిష్‌’ ఒకటి. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలు, అతి భారీ విజయాలు అందుకున్నాయి. దీంతో మూడో సీక్వెల్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌ జనాలతోపాటు సౌత్‌ జనాలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ‘క్రిష్‌’ సినిమాలు మన వాళ్లకు కూడా బాగా దగ్గరైపోయాయి. ఈ క్రమంలో చాలాసార్లు ‘క్రిష్‌ 4’ గురించి సినిమా కోర్‌ టీమ్‌కి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

krrish 4

అదిగో, ఇదిగో అని చెబుతూ వచ్చిన టీమ్‌ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది అనే మాత్రం తెలిసింది. అది కథ కాదని, బడ్జెట్‌ అని చిన్నగా సన్నాయి నొక్కులు కూడా బయటకు వచ్చాయి. బాలీవుడ్‌ పరిస్థితి ఏమంత బాగోలేకపోవడం, హీరో హృతిక్‌ రోషన్‌ మార్కెట్‌ అంతగా భారీగా లేకపోవడం లాంటి కారణాల వల్ల నాలుగో ‘క్రిష్‌’ హోల్డ్‌లో ఉన్నాడు అని చూచాయగా తెలిసింది. మధ్యలో దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ ఈ సారి మెగా ఫోన్‌ పట్టుకోకూడదు అని నిర్ణయం తీసుకోవడం కూడా ఓ కారణం.

అయితే, కెప్టెన్‌ కుర్చీ ఎక్కడానికి హృతిక్‌ రోషన్‌ రెడీ అవ్వడంతో సినిమాను త్వరలో స్టార్ట్‌ చేస్తారని వార్తలొచ్చాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు బడ్జెట్‌ కూడా రెడీ అయింది అని చెబుతున్నారు. ఈ ఫ్రాంఛైజీ తొలి మూడు సినిమా ‘కొయీ మిల్‌గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’కి మించిన బడ్జెట్, కథాంశంతో నాలుగో ‘క్రిష్‌’ రెడీ చేయాలని రాకేష్ రోషన్ కథతో రెడీ అయ్యారట. ప్రీ ప్రొడక్షన్ ఆలస్యం, ఫైనాన్స్ సెట్‌ అవ్వడంతో హృతిక్‌ కోర్టులోకి బంతి వచ్చిపడిందట.

ఇటీవల ‘వార్‌ 2’ పనులు పూర్తి చేసుకొని, ఫలితం వచ్చాక ఢీలా పడిపోయిన హృతిక్‌ త్వరలో ‘క్రిష్‌ 4’కి రెడీ అవుతాడట. మధ్యలో ‘ఆల్ఫా’ సినిమాలో చిన్న అతిథి పాత్ర చేయాల్సి ఉందట. అది అయ్యాకనే ‘క్రిష్‌ 4’ వైపు వస్తాడట. అప్పుడే సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారట. ఇది 2026లో ఉండొచ్చు అంటున్నారు. ఇక సినిమాను 2027లోనే రిలీజ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారట.

 117 మంది మ్యూజీషియన్లు.. ప్రత్యేకమైన వాద్య పరికరాలు.. తమన్‌ మాస్‌ ఇది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus