త్రిష పెళ్ళంటూ చాలా ఏళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి అవాస్తవాలంటూ కొట్టి పారేస్తోంది త్రిష. నిజానికి గతంలోనే వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యింది. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వరుణ్ మణియన్ కు ఓ స్టార్ హీరోతో వివాదం ఉండడంతో, అతనిని ఎంగేజ్మెంట్ కు పిలవద్దు అని త్రిషతో చెప్పాడట వరుణ్. కానీ అతని మాటను లెక్కచెయ్యకుండా ఆ స్టార్ హీరోని ఎంగేజ్మెంట్ కు పిలిచింది త్రిష.
దాంతో వరుణ్ కు కోపం వచ్చింది.. ఆ తరువాత వీళ్ళిద్దరికీ మనస్పర్థలు వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ త్రిషకు పెళ్లంటూ వార్తలు మొదలయ్యాయి. కొద్దికాలంగా త్రిష ఓ వ్యాపారవేత్త తో డేటింగ్లో ఉందని సమాచారం. ఇప్పటికే వీళ్ళు ఫారిన్ టూర్లకు కూడా రెండు, మూడు సార్లు వెళ్ళొచ్చారట. త్రిష సినీ కెరీర్ కు కూడా ఏమీ అడ్డు చెప్పను అని ఆ బిజినెస్ మెన్ హామీ ఇచ్చాడట. ఎలాగూ ఆఫర్లు కూడా తగ్గాయి కదా అని త్రిష పెళ్ళికి ఓకే చెప్పేసిందట.
ఈ కరోనా టైంలోనే తక్కువ మంది సమక్షంలో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని వినికిడి. అతి త్వరలో త్రిష పెళ్లి పై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా త్రిష పెళ్లి జరుగుతుందా.. లేక ఎంగేజ్మెంట్ తో ఆగిపోతుందా..? అసలు ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముంది? అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..!
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!