Narne Nithin: ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఫస్ట్ మూవీ!

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మొదటి సినిమా ఇప్పుడు రిలీజ్ కావడం ఏంటి? అతని మొదటి సినిమా ‘మ్యాడ్’ కదా? అది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది కూడా? ఇప్పుడు అతని మొదటి సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి? ఇలాంటి ప్రశ్నలే పైనే హెడ్డింగ్ చూశాక మైండ్లో మెదిలేది. అయితే వాస్తవానికి నార్నె నితిన్ ‘మ్యాడ్’ కంటే ముందుగా ఓ సినిమాలో నటించాడు. దాని పేరు ‘శ్రీ శ్రీ శ్రీ రాజ వారు’.

శర్వానంద్ కి ‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ‘శ్రీ వేదాక్షర మూవీస్’ బ్యానర్ పై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. అందుకే ‘మ్యాడ్’ ప్రమోషన్స్ లో కూడా నార్నె నితిన్ (Narne Nithin) దీని గురించి ఎక్కువ ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. ‘మ్యాడ్’ హిట్ అయ్యింది కాబట్టి.. ‘శ్రీ శ్రీ శ్రీ రాజ వారు’ ఇక రిలీజ్ కాదేమో అని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ” ‘శ్రీ వేదాక్షర మూవీస్’ బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తో ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ అనే సినిమాని నిర్మిస్తున్నాను. సతీష్ వేగేశ్న దర్శకుడు. ఇది మంచి కమర్షియల్ సినిమా.ఈ నెలలో అంటే జనవరిలోనే తొలి కాపీ రెడీ అవ్వనుంది.

మరోపక్క కన్నడ స్టార్ హీరోతో కూడా ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాం . మరాఠీలో కూడా సినిమా చేయాలి. అలా అని తెలుగులో ఫోకస్ చేయడం లేదు అనుకోకండి. తెలుగులో కూడా ఓ స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేసే పనిలో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ‘గుర్తుందా శీతాకాలం’, ‘రంగ మార్తాండ’ వంటి సినిమాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు చింతపల్లి రామారావు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus