తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమాకి సర్వం సిద్ధమైందా అంటే నిజమే అంటున్నారు అందరూ. అయితే, రీసంట్ గా స్టార్ట్ చేసిన రానా – పవన్ కళ్యాణ్ ల సినిమా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాగర్ చంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి బిల్లా రంగా అనే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే, ఇంకో టైటిల్ కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారట. పరుశురామ – కృష్ణమూర్తి అనే టైటిల్ చాలా బాగా సినిమా యాప్ట్ అవుతుందని తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ టైటిల్ ఉంటుందని చెప్తున్నారు.
మలయాళంలో హిట్టైన అయ్యప్పన్ కోషియామ్ ని రీమేక్ చేస్తున్నా సంగతి తెలిసిందే. దీనికి పరుశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ ని పెడితే ఎలా ఉంటుందన్న కోణంలోనూ చిత్రయూనిట్ చర్చలుజరుపుతోందట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌జరుపుకోనున్న ఈసినిమాలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే ,తొలి షెడ్యూల్ మాత్రం కేరళలోనే జరగనుందట. తెలుగు నేటివిటిలో ఎలాంటి మార్పు ఉండకూడదనే ఉద్దేశ్యంతో పొలాచ్చిలో షూటింగ్ ని ప్లాన్ చేశారట. హీరోయిన్లుగా సాయిపల్లవి, ఐశ్వర్యా రాజేష్ ల పేర్లు గట్టిగా వినిస్తున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదీ విషయం