బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ తో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ విజయాన్నే సొంతం చేసుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘జయ జానకి నాయక’ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈ 2 సినిమాల వల్ల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి మంచి మార్కెట్ అయితే ఏర్పడింది.
అతనిపై రూ.30 కోట్లు పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇప్పటికీ రెడీగానే ఉన్నారు. కానీ చెప్పుకోవడానికి ఓ సాలిడ్ హిట్ అంటూ లేదు. ‘రాక్షసుడు’ హిట్ సినిమానే. కానీ దాని బడ్జెట్ కి.. వచ్చిన వసూళ్లకి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి హిట్ అనిపించుకుంది. కానీ బ్లాక్ బస్టర్ అయితే కాదు. 2014 లో ఇండస్ట్రీకి వచ్చాడు బెల్లంకొండ. రూ.10 కోట్ల పారితోషికం అందుకునే రేంజ్ కి వెళ్ళాడు. హిందీలో కూడా రూ.15 కోట్ల మార్కెట్ ఉంది. అక్కడ స్ట్రైట్ మూవీ కూడా చేశాడు. చెప్పుకోడానికి ఇవన్నీ ఉన్నాయి. కానీ సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా లేదు.
ఈ విషయాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అంగీకరించాడు. నిన్న జరిగిన ‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ” నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. నా సినిమాలను ఆదరిస్తున్నారు. అన్నీ ఉన్నా ఏదో తెలీని వెలితి. అది ‘కిష్కింధపురి’ తో తీరుతుంది అని ఆశిస్తున్నాను” అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు.