Prabhas: ప్రభాస్ పుట్టిన రోజున గట్టిగా ప్లాన్ చేసిన ఫ్యాన్స్.. కొత్త రికార్డులు సృష్టించాల్సిందే?

టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇలా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

అక్టోబర్ 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు తన పుట్టినరోజును భారీగా నిర్వహించాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల పుట్టినరోజులు కనుక వస్తే వారి కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలను విడుదల చేయడం ట్రెండ్ అవుతుంది.ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన వర్షం సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23వ తేదీ కావడంతో వర్షం సినిమాని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22, 23వ తేదీలలో ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.2004వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఈ సినిమాలో త్రిష ప్రభాస్ హీరో హీరోయిన్లుగా నటించగా గోపీచంద్ విలన్ పాత్రలో నటించారు.

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్లో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందించారు. అప్పట్లో ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. 2004లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా రీ రిలీజ్ అవుతూ ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.మొత్తానికి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus