మరోసారి పూరి డైరెక్షన్లో బాలయ్య మూవీ ఫిక్స్..!

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రమైన ‘పైసా వసూల్’ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు బాలయ్య 100చిత్రాలకు..ఈ 101వ చిత్రానికి సంబంధం ఉండదు. అంత కొత్తగా ‘పైసా వసూల్’ చిత్రంలో బాలయ్య కనిపిస్తాడు. అలా అని ఈ చిత్రం సూపర్ హిట్ అయితే కాలేదు. కానీ బాలయ్య ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ఇచ్చింది. ఆ టైములో పూరి జగన్నాథ్ ను ఓ రేంజ్లో పొగిడేశారు బాలయ్య అభిమానులు.

రిజల్ట్ తో సంబంధం లేకుండా మళ్ళీ ఈ కాంబినేషన్లో సినిమా రావాలని వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారి కోరిక తొందరలోనే నెరవేరబోతోందని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్న బాలయ్య.. ఇది పూర్తయిన వెంటనే పూరి డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవల వీరిద్దరూ ఈ ప్రాజెక్టుకి సంబంధించి డిస్కస్ చేసుకున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ తో సినిమా పూర్తయిన వెంటనే పూరి..

బాలయ్య ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చేసి.. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టెయ్యాలని పక్కా ప్లాన్ తో ఉన్నాడట పూరి. ఎన్టీఆర్ తో పూరి చేసిన మొదటి చిత్రం ‘ఆంథ్రావాలా’ విజయం సాధించలేదు. కానీ తరువాత చేసిన ‘టెంపర్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బాలయ్య విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus