Rajashekar, Gopichand: టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం..!

టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ ల జోరు కొనసాగుతుంది. ఆల్రెడీ దర్శక ధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోలతో ‘ఆర్.ఆర్.ఆర్’ ను తెరకెక్కిస్తున్నాడు. మరోపక్క పవన్ కళ్యాణ్, రానా లు కలిసి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో నటిస్తున్నారు.ఇక వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ లు కలిసి ఆల్రెడీ ‘ఎఫ్ 2’ లో నటించారు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇప్పుడు దాని సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ లో కూడా నటించేస్తున్నారు.

ఈ ఏడాదే ఈ సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయి అని అనౌన్స్ చేశారు కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో .. మళ్ళీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రూపొందనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. యాక్షన్ హీరో గోపీచంద్ అలాగే సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ కలిసి ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘ల‌క్ష్యం’ ‘రామరామ కృష్ణ కృష్ణ’ ‘లౌక్యం’ ‘డిక్టేటర్’ ‘సాక్ష్యం’ వంటి చిత్రాల‌ను అందించిన దర్శకుడు శ్రీవాస్ ఈ మల్టీస్టారర్ ను కూడా తెరకెక్కించబోతున్నారు అని వినికిడి.

సైలెంట్ గా ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొదలయ్యాయట. ఓ ప్రముఖ బిజినెస్ మెన్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని వినికిడి. మరోపక్క రాజశేఖర్ ..వెంకటేష్ మహా డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే గోపీచంద్ కూడా మారుతి డైరెక్షన్లో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus