Sankalp Reddy, Gopichand: సంకల్ప్ రెడ్డి, గోపీచంద్: ఇద్దరూ హిట్టు కొట్టాల్సిందే..!

గోపీచంద్‌ (Gopichand)  మాస్ హీరో. అయినప్పటికీ కొత్తగా ప్రయత్నించాలని చేసిన ‘ఒక్కడున్నాడు’ ‘ఒంటరి’ ‘సాహసం’ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ ఏడాది `భీమా`(Bhimaa) , ‘విశ్వం’ (Viswam)  వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపీచంద్. అవి రొటీన్ గా ఉన్నా బాగానే ఆడాయి. కానీ బ్లాక్ బస్టర్స్ రేంజ్ కాదు. మాస్ లో గోపీచంద్ బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదు అని మాత్రం అవి ప్రూవ్ చేశాయి. అందుకే తన నెక్స్ట్ సినిమాలని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు గోపీచంద్.

Sankalp Reddy, Gopichand

వాస్తవానికి ‘జిల్’ (JIl) ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌తో (Radha Krishna Kumar) ఓ సినిమా చేయాలి. అదీ యూవీ బ్యానర్లో..! కానీ ప్రస్తుతానికి అది హోల్డ్ లో పడింది. ఈ క్రమంలో సంక‌ల్ప్ రెడ్డి చెప్పిన క‌థకి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘ఘాజీ’ తో (Ghazi) సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకుడిగా మారాడు. ఆ త‌ర‌వాత ‘అంత‌రిక్షం’ (Antariksham 9000 KMPH) చేశాడు. అది ఆడలేదు. హిందీలో ‘ఐబీ – 71’ (IB71) అనే సినిమా చేశాడు. అది కూడా ప్లాప్ అయ్యింది.

దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని మరో ఇంట్రెస్టింగ్ కథ రాసుకుని గోపీచంద్ ని అప్రోచ్ అయ్యాడు. గోపీచంద్ కూడా వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుతో హిట్టు కొట్టడం గోపీచంద్ కే కాదు సంకల్ప్ రెడ్డి కూడా చాలా అవసరం అని చెప్పాలి. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ అధినేత చిట్టూరి శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం.

మంచు ఫ్యామిలీ గొడవ.. మీడియా ముందుకు వచ్చిన మనోజ్..వీడియో వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus