Surekha Vani: హాట్ టాపిక్ గా మారిన సురేఖ వాణి లేటెస్ట్ ఫోటో.. మెడలో ఏంటది?

  • March 13, 2023 / 06:48 PM IST

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందకు పైగా సినిమాల్లో నటించిన వారిలో సురేఖ వాణి కూడా ఒకరు.మొదట ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షోతో ఈమె సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ షోతో వచ్చిన క్రేజ్ వల్లే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.’బొమ్మరిల్లు’ ‘దుబాయ్ శీను’ ‘రెడీ’ ‘బాద్ షా’ ‘ఏమాయ చేసావే’ ‘నాయక్’ ‘పవర్’ వంటి సినిమాల్లో ఈమె గుర్తుండిపోయే పాత్రలు పోషించింది.ఇక తన భర్త సురేష్ తేజ మరణం తర్వాత సినిమాలు తగ్గించిన సురేఖ వాణి.

ఎక్కువగా సోషల్ మీడియా పైనే ఫోకస్ పెడుతుంది. సినిమాల్లో కనిపించినా ఒకటి రెండు నిమిషాలు కనిపించే పాత్రల్లోనే ఈమె కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో అయితే ఆమె చేసే పాత్రలకు పేర్లు కూడా ఉండటం లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. సురేఖ వాణి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే.. ఈమె సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుంది అనే డిస్కషన్లు ఇప్పుడు మొదలయ్యాయి.

సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్య సమస్యలతో 2019లో మరణించారు. ప్రస్తుతం కూతురు సుప్రీతే సర్వస్వం గా జీవిస్తున్నట్టు ఈమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే సైలెంట్ గా ఈమె ఓ వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలకు మెయిన్ రీజన్ .. సురేఖ వాణి లేటెస్ట్ ఫోటోల్లో ఆమె మెడలో నల్లపూసలు కనిపిస్తుండటం అని చెప్పాలి. అయితే ఈ ఊహాగానాల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus