ఉదయ్ కిరణ్ బయోపిక్ కు రంగం సిద్ధం..!

ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కు లోనయ్యి అఘాయిత్యం చేసుకున్న సంగతి తెలిసిందే. అతను స్టార్ గా ఎదిగినప్పటికీ.. ‘కావాలనే అతను సైన్ చేసిన ప్రాజెక్ట్ ల నుండీ అతన్ని తొలగించేశారని… అందుకే అతను డిప్రెషన్ కు లోనయ్యి.. ప్రాణ హానికి పాల్పడ్డాడని.. బాలీవుడ్ లో ‘నెపోటిజం’ ఉందని’ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లను సైతం ట్రోల్ చేసి ఓ ఆట ఆడుకున్నారు.

ఇది పక్కన పెడితే.. సుశాంత్ సింగ్ ఇష్యు మొదలైనప్పటి నుండీ ఉదయ్ కిరణ్ ను కూడా గుర్తుచేసుకుంటున్నారు మన టాలీవుడ్ ప్రేక్షకులు. ఉదయ్ కిరణ్ కూడా సేమ్ సుశాంత్ లాగానే ఈ లోకాన్ని విడచి వెళ్ళిపోయాడు. అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్ ను తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ ను కూడా తెరకెక్కించాలని ఓ డైరెక్టర్ భావిస్తున్నాడట. ఉదయ్ కిరణ్ బయోపిక్ ను మొదట తేజ డైరెక్ట్ చేస్తాడు అని వార్తలు వచ్చాయి.

కానీ తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసాడు డైరెక్టర్ తేజ. తరువాత సందీప్ కిషన్ .. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారంలో కూడా నిజం లేదని తేలిపోయింది. అయితే ఉదయ్ కిరణ్ తో గతంలో రెండు సినిమాలు తీసిన డైరెక్టర్.. ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం. అయితే ఆ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus