Bigg Boss 7 Telugu: ఈవారం హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరు ? లిస్ట్ ఇదే..!

  • September 9, 2023 / 10:27 AM IST

బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి అంతా ఉల్టా పల్టా అన్నట్లుగానే గేమ్ స్టార్ట్ అయ్యింది. హౌస్ మేట్స్ లోపలకి వెళ్లారు కానీ, ఇంకా కన్ఫార్మ్ కంటెస్టెంట్స్ మాత్రం కాలేదు. పవర్ అస్త్రం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్లే కన్ఫార్మ్ అవుతారని బిగ్ బాస్ తేల్చి చెప్పేశాడు. అందుకే, ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ రసవత్తరంగా మారింది. ఇక ఈ వీకండ్ ఒక స్టార్ హీరోయిన్ కూడా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఆ హీరోయిన్ ఎవరా అని ఆరాతీస్తే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు హీరోయిన్ కౌషా ఇంకొకరు హీరోయిన్ లైలా. వీరిద్దరూ కూడా హౌస్ లోకి వెళ్లబోతున్నట్లుగా చెప్తున్నారు. అయితే, కేవలం ఒకటి రెండు వారాలు మాత్రమే హౌస్ మేట్స్ గా ఉండి వచ్చేస్తారా.. లేదా చివరి వరకూ కూడా గేమ్ ఆడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంకా వీళ్లతో పాటుగా ఈసారి సీజన్ లోకి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్న వారి లిస్ట్ ఒకటి లీక్ అయ్యింది.

వాళ్లు ఎవరంటే., అర్జున్ అంబటి సీరియల్ ఆర్టిస్ట్, యాంకర్ వర్షిణి పవన్ సాయి రాజ్ పుత్ , యాక్టర్ క్రాంతి , నిఖిల్ విజయేంద్ర , పూజా మూర్తి కానీ ఐశ్వర్యా కానీ వస్తున్నారని టాక్. అలాగే భోలే షావాలి , ఇంకా సీనియర్ హీరోయిన్ ఫర్జానా పేరు వినిపిస్తోంది. వీళ్లు జంటలు జంటలుగా హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే, వీళ్లు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదట.

లేట్ గా వస్తున్న హౌస్ మేట్స్. వీళ్లు ముందుగా పవర్ అస్త్రం దక్కించుకుంటే ఖచ్చితంగా అందరికంటే ముందు కన్ఫార్మ్ హౌస్ మేట్స్ అయిపోతారు. అప్పుడు కన్ఫార్మ్ కాని వాళ్లు, నామినేషన్స్ లో ఉన్న వాళ్లు పబ్లిక్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అవుతారు. ఈసారి (Bigg Boss 7 Telugu) సీజన్ 7ని ఇలా ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా డిజైన్ చేశారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus