జూలై 25న నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ `మ‌న్మ‌థుడు 2` ట్రైల‌ర్!

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది.

ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో టీజ‌ర్‌కి.. అవంతిక అనే పాత్ర‌లో న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ విడుద‌లై హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ఈ నెల 25న ఈ సినిమా ట్రైల‌ర్‌ను నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఆగ‌స్ట్ 9న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus