మహేష్ కి బర్త్ డే విషెష్ చెబుతూ అసలు విషయం బయటపెట్టిన నరేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజుని నిన్న వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు వంశీ పైడిపల్లి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే క్యాలెండర్ 9 కి మారగానే అభిమానుల సందడి మొదలయిపోయింది. పైగా మహేష్ 25 వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. ఓ వైపు శుభాకాంక్షలు, మరో వైపు ఫస్ట్ లుక్ అదరహో అంటూ ట్వీట్స్ వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే మహర్షి సినిమాలో నటిస్తున్న అల్లరి నరేష్ మహేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు సినిమాలో తమ ఇద్దరి పేర్లను వెల్లడిస్తూ కథని లీక్ చేశారు. తనకి మహేష్ ప్రాణ స్నేహితుడని చెప్పకనే చెప్పారు. కథలో రిషి తన స్నేహితుడి కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తాడని తెలుస్తోంది.

ఆ స్నేహితుడే రవి (అల్లరి నరేష్). రవి టూ రిషి అని నరేష్ చేసిన ట్వీట్ ప్రకారం రవి కోసం రిషి సినిమాలో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు అర్ధమయింది. ఎండా తగలకుండా బతికే రిషి.. స్నేహితుడికోసం రైతులతో కలిసి ఎండలో పనిచేయబోతున్నట్టు సమాచారం. నరేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus