Allari Naresh: తన 21 ఏళ్ళ కెరీర్లో అల్లరి నరేష్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

దివంగత స్టార్ డైరెక్టర్ అయిన ఇవివి సత్యనారాయణ గారి చిన్న కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్.. మొదటి చిత్రంతోనే హిట్టు కొట్టి.. ఆ సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. అటు తర్వాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.ఓ విధంగా తన తండ్రికి కల్పవృక్షంగా మారాడు అనే చెప్పాలి. ఎందుకంటే నరేష్ – ఇవివి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. బాగా డబ్బులు తెచ్చాయి. అలా అని కామెడీ సినిమాలకే పరిమితం కాకూడదు అని భావించి.. ఆ సెంటిమెంట్ ను అప్పుడప్పుడు బ్రేక్ చేస్తూ ‘నేను’ ‘డేంజర్’ ‘పెళ్ళైంది కానీ’ ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘శుభప్రదం’ వంటి సినిమాలు కూడా చేశాడు.

అయినా తన బలాన్ని వదల్లేదు. కానీ ఇవివి సత్యనారాయణ గారు చనిపోయాక నరేష్ కెరీర్ నత్త నడకలా సాగుతుంది అన్నది వాస్తవం. ‘మహర్షి’ నుండి రూటు మార్చి ‘నాంది’ వంటి సీరియస్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సినిమాలు హిట్ అయ్యాయి కానీ మిగిలిన సినిమాలు హిట్ అవ్వడం లేదు. ఇటీవల వచ్చిన ‘ఉగ్రం’ కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు అంటే మే 10 కి అల్లరి నరేష్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అతను హీరోగా పరిచయమైన ‘అల్లరి’ సినిమా 2002 మే 10న రిలీజ్ అయ్యింది. దీంతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు అల్లరి నరేష్. ’21 సంవత్సరాలు.. 60 శుక్రవారాలు.. లెక్కలేనన్ని ప్రశంసలు.. తరాలు మారినా ప్రేమ ఎప్పుడూ మారలేదు.

పాలో కొయెల్హో చెప్పినట్లుగా, ‘ఓడరేవులో ఉన్నప్పుడు ఓడ సేఫ్ గా ఉంటుంది. కానీ దాని కోసం ఓడలు నిర్మించబడలేదు కదా. అలాగే నా ఈ ప్రయాణం కూడా అంతే..! లోతుల్లోకి ప్రయాణించేందుకు, కొత్త తరాలను అన్వేషించేందుకు, నా సరిహద్దులను ముందుకు తీసుకెళ్లేందుకు.. మీరు నన్ను ప్రతిసారీ ముక్తకంఠంతో ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఏమైనా చేయగలిగానంటే అదంతా మీ ఆశీర్వాదం వల్లే. నన్ను మీ కుటుంబంలో భాగం చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను..” అంటూ అల్లరి నరేష్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. అల్లరి నరేష్ తన 21 ఏళ్ళ సినీ ప్రయాణంలో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. కొన్ని కథలు నచ్చక, మరికొన్ని కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేక కొన్ని ప్రాజెక్టులు వదులుకున్నాడు. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్య :

సుకుమార్ మొదట ఈ కథని ప్రభాస్ తో పాటు అల్లరి నరేష్ కు కూడా చెప్పడం జరిగింది. కానీ నరేష్ బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టుని పట్టించుకోలేదు.

2) హ్యాపీ హ్యాపీగా :

అల్లరి నరేష్ బిజీగా ఉండటంతో ఈ సినిమా వరుణ్ సందేశ్ కు వెళ్ళింది. ఈ సినిమా అయితే పెద్దగా ఆడలేదు.

3) బురిడీ :

తన తండ్రి ఇవివి తెరకెక్కించిన ఈ సినిమా కూడా అల్లరి నరేష్ వదులుకున్నాడు. తర్వాత ఆర్యన్ రాజేష్ చేయగా పెద్దగా సక్సెస్ కాలేదు.

4) రామాచారి :

వేణు హీరోగా నటించిన ఈ మూవీ కథ మొదట అల్లరి నరేష్ వద్దకు వెళ్ళింది. కానీ అతను చేయలేదు.

5) పైసా :

కృష్ణవంశీ దర్శకత్వంలో ‘డేంజర్’ అనే సినిమాలో నటించిన అల్లరి నరేష్.. బిజీగా ఉండి ‘పైసా’ కథని ఓకే చేయలేకపోయాడు.

6) కార్తికేయ :

నిఖిల్ చేసిన ఈ సూపర్ మూవీ కథ మొదట అల్లరి నరేష్ వద్దకు వెళ్ళింది. కానీ అతను చేయలేదు.

7) భలే భలే మగాడివోయ్ :

దర్శకుడు మారుతి మొదట ఈ కథని అల్లరి నరేష్, సునీల్ .. లకు చెప్పాడు. ఇద్దరూ ఈ కథని వద్దనుకున్నారు. తర్వాత నాని చేయడం సూపర్ హిట్ అవ్వడం జరిగింది.

8) తిక్క :

సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ చిత్రం కథ మొదట అల్లరి నరేష్ వద్దకు వెళ్ళింది. కానీ అతను చేయలేదు. సినిమా అయితే ప్లాప్ అయ్యింది.

9) డిస్కో రాజా:

రవితేజ హీరోగా నటించిన ఈ మూవీలో సునీల్ పాత్రకు మొదట అల్లరి నరేష్ ను అడిగారు. కానీ పాత్ర నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు.

10) బింబిసార :

దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ కథని రవితేజ, అల్లరి నరేష్, రామ్, అల్లు శిరీష్ వంటి ఎంతో మంది దర్శకులకు చెప్పాడు. కానీ ఎవ్వరూ ఓకే చేయలేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus