Bachhala Malli: బాక్సాఫీస్ ఫైట్.. అల్లరి నరేష్ కూడా సిద్ధమే!

ఇటీవల కాలంలో కామెడీ నుంచి సీరియస్ చిత్రాల వైపు మళ్లిన అల్లరి నరేష్ Allari Naresh), మరోసారి తనలో కొత్త వైవిధ్యాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమయ్యాడు. కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్, గతంలో ‘నాంది’ వంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాతో తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better) చిత్రంతో డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుబ్బు మంగదేవి (Subbu Mangadevi) దర్శకత్వంలో, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బచ్చల మల్లి (Bachhala Malli) .

Bachhala Malli

ఈ సినిమాను విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పించే నిర్మాత రాజేష్ దండా (Rajesh Danda)  నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సమాచారం. డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్టర్‌లతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, నరేష్‌ని మాస్ అవతారంలో చూపించనుంది. కామెడీ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ వైపు వెళ్లిన నరేష్ ఈ సినిమాతో ఇంకొక సీరియస్ పాత్రను చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఈ డిసెంబర్ 20న బచ్చల మల్లి తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నటించిన భైరవం అలాగే నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ (Robinhood) సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అంతే కాకుండా మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా అదే తేదీని లక్ష్యంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇన్ని సినిమాలు పోటీలో ఉండగా, బచ్చల మల్లికు మార్కెట్‌లో తనదైన స్థానం దక్కించుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు.

మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్రలో నటించిన భైరవం పై అంచనాలు భారీగా ఉండగా, నితిన్ నటించిన రాబిన్ హుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో వీటి మధ్య బచ్చల మల్లి (Bachhala Malli) నిలబడగలదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి డిసెంబర్‌ 20న బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది. ఇక నరేష్ కెరీర్ కు ఈ సినిమా హిట్టవ్వడం చాలా కీలకం. మరి అతను జనాలను ఎంతవరకు ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి.

పుష్ప 2 టిక్కెట్ రేట్లు.. దేవర కంటే ఎక్కువ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus