Keerthy Suresh: ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!

‘నేను శైలజ’ ‘నేను లోకల్’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఆ తర్వాత సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ తో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఈమె వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించింది. ‘సర్కారు వారి పాట”దసరా’ ‘భోళా శంకర్’ వంటి సినిమాల ద్వారా అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. అయితే తమిళ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది.

Keerthy Suresh

ఈ మధ్యనే ఓ హిందీ సినిమాలో కూడా నటించింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. రెండు రోజుల ఆమె పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. డిసెంబర్లో, గోవాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతుంది అనేది ఆ వార్త సారాంశం.గతంలో కూడా కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లి గురించి ఇలాంటి ప్రచారమే జరిగింది కాబట్టి.. ‘ఇవి వట్టి అపోహలే’ అని కొట్టి పారేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రచారమే నిజమైంది.

కీర్తి (Keerthy Suresh) నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది. తన ప్రియుడు ఆంటోనీ తటిల్ తో కీర్తి (Keerthy Suresh) వివాహం జరగనుంది. డిసెంబర్ 11,12 తేదీల్లో.. గోవాలో తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరగబోతుంది అని సమాచారం. ఇక ఆంటోనీ తటిల్ దుబాయ్ కి చెందిన బిజినెస్ మెన్ అని తెలుస్తుంది. అలాగే ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. అతని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

‘పుష్ప 2’ తో పాటు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని నమోదు చేసిన 10 ట్రైలర్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus