Tejaswi Madivada: పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

తేజస్వి మదివాడ (Tejaswi Madivada)…అందరికీ సుపరిచితమే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ‘హార్ట్ ఎటాక్’ (Heart Attack) ‘ఐస్‌క్రీం’ (Ice Cream) ‘కేరింత’ (Kerintha) ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ (Subramanyam for Sale) వంటి సినిమాల్లో నటించింది. అలా సంపాదించుకున్న క్రేజ్ తో ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో అడుగుపెట్టింది. అక్కడ ఆమె ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అని చెప్పాలి. ఆ షోలో తేజస్వి.. తోటి కంటెస్టెంట్ కౌశల్ ని (Kaushal) బాగా టార్గెట్ చేసింది.

Tejaswi Madivada

సామ్రాట్ (Samrat), తనీష్ (Tanish) వంటి వారిని ఫ్రెండ్స్ గా చేసుకుని.. వారిని కౌశల్ పైకి రెచ్చగొట్టి వదలడం వంటివి ఆడియన్స్ కి నచ్చలేదు. దీంతో రియల్ లైఫ్ లో కూడా తేజు బ్యాడ్ అయిపోయింది. తర్వాత బిబి జోడి అనే షోలో కూడా కౌశల్ తో ఈమె గొడవ పడుతూ ఉండేది. వీటి వల్ల ఆమెకు సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి. ‘కమిట్మెంట్’ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వంటి వెబ్ సిరీస్..లలో నటించింది.

వాటిల్లో ఈమె రెచ్చిపోయి ఇంటిమేట్ సీన్స్ లో నటించింది. కానీ అవి కూడా ఆమెకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టలేదు. అయితే సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన పాస్ట్ గురించి ఓపెన్ అయ్యింది ఈ అమ్మడు. గతంలో ఈమెకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారట. వాళ్ళు ఆమెను అన్ని రకాలుగా వాడుకుని వదిలేశారట.

దీంతో ఆమెకు జాగ్రత్త పెరిగినట్టు కూడా తెలిపింది. ఎవరితో ఎంతలో ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి వంటి వ్యవహారాలపై చాలా అనుభవం వచ్చినట్టు ఈమె చెప్పుకొచ్చింది. అలా అని ప్రేమపై నమ్మకం అయితే కోల్పోలేదట. పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా కలిగి ఉన్నట్టు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus