మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావుగారు ఓ పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకకి ముఖ్య అతిధిగా అల్లు అరవింద్, రాంచరణ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి చిరంజీవి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. ముఖ్యంగా అల్లు అరవింద్ .. చిరంజీవి రాజకీయ ఉద్దేశాల గురించి చెప్పిన విషయాలు బాగా ఆకట్టుకున్నాయి.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “చిరంజీవి గారి సినీ ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇక నేను కూడా నలభై ఏళ్లుగా ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాను. బావమరిదిగా కంటే మంచి స్నేహితులుగానే మేము కలుసుంటాం. మా ఇద్దరిదీ ఎంతో ఎమోషనల్ జర్నీ. 1995, 96 సమయంలో చిరంజీవిగారి పుట్టినరోజు నాడు ఆయన అభిమానులు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు వెళ్లి.. బ్లడ్ డొనేట్ చేసి తిరిగి వస్తోన్న టైంలో చిరంజీవి గారు నాతో ఇలా అన్నారు. ‘మన ఫ్యాన్స్ అందరినీ సమాజానికి ఉపయోగపడేలా ఓ తాటి మీదకి తీసుకొస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి.. కోట్ల రూపాయలు వెచ్చించి.. మ్యానేజింగ్ ట్రస్టీగా నన్ను నియమించి ఇప్పటికీ మైంటైన్ చేస్తున్నారు. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. ఆయన చాలా మంచి వ్యక్తి .. ‘అయితే రాజకీయాల్లో ఉన్నాం కదా.. ఇంత మంచితనం పనికిరాదు అని అప్పట్లో చిరంజీవికి నేను చెప్పను. దానికి ఆయన ‘రాజకీయం అనేది పని.. అంటే అదొక వృత్తి.. మంచితనం అనేది నా ప్రవృత్తి’.! వృత్తి గురించి ప్రవృత్తిని మార్చుకోలేను.. ఇలానే ఉంటాను..!’ అంటూ ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తితో ప్రయాణం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!