Anupama: సుకుమార్‌ – అనుపమ – అరవింద్‌.. ఏమైనా రచ్చా ఇది!

‘టైమివ్వు పిల్ల కొంచెం టైమివ్వు…’ అంటూ వచ్చిన నిఖిల్‌ అండ్‌ అనుపమకు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. దీంతో చిత్రబృందం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు అల్లు అరవింద్, దర్శకనిర్మాత సుకుమార్‌ అయితే ఏకంగా స్టెప్పులేసేంత ఆనందంగా ఉన్నారు. స్టెప్పేలేసేంత ఏంటి.. స్టెప్పులేశారు కూడా. అది కూడా హీరోయిన్‌తో కలసి. ఇటీవల జరిగిన సినిమా సక్సెస్‌ పార్టీలో టీమ్‌ అంతా సందడి చేశారు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అల్లు అరవింద్, సుకుమార్‌, అనుపమ పరమేశ్వరన్‌తో కలసి డ్యాన్స్ చేశారు.

ఈ వీడియోను సినిమా హీరో నిఖిల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘టైమివ్వు పిల్ల కొంచెం టైమివ్వు’ పాటలోని సిగ్నేచర్ స్టెప్ వేసి అందరూ ఫుల్‌ రచ్చ చేశారు. దీంతో ఏమన్నా రచ్చా ఇది అంటూ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. మరికొందరైతే అల్లు అరవింద్‌లో ఈ కళ కూడా ఉందా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై నిర్మించిన ‘18 పేజేస్’ సినిమా డిసెంబరు 23న థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది.

దీంతోనే ఈ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. సుకుమార్ అందించిన కథకు ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తోనే ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది అని విశ్లేషకులు చెబుతున్నారు. భిన్నమైన కథాంశంతో ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ కలిగిందని చెప్పొచ్చు. కాగా, ‘18 పేజెస్’ సినిమాను సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమ్‌ చేస్తారని చెబుతున్నారు.

అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. థియేటర్లలో సినిమా రన్‌ అయిపోయింది అని క్లారిటీ రాగానే ఈ సినిమా ఓటీటీ విషయం వెల్లడిస్తారు అని సమాచారం. ‘కార్తికేయ 2’తో హిట్ జోడీ అనిపించుకున్న నిఖిల్‌ – అనుపమ ఆ ట్రెండ్‌ను ‘18 పేజెస్‌’తో కంటిన్యూ చేశారు. మరి ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకుల్ని అలరిస్తారో చూడాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus