కొడుకుని ప్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టేసిన అల్లు అరవింద్?

తాజాగా ‘ఏబీసీడి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు శిరీష్. సంజీవ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ – యశ్ రంగినేని కలిసి నిర్మించారు. ఈ చిత్రం కూడా శిరీష్ కు పెద్ద ప్లాపుగానే మిగిలింది. మొదటి రోజు సాయంత్రం షో కే ఈ చిత్రం దుకాణం సర్దేసింది. ఈ చిత్రాన్ని 7 కోట్లకు కొనుగోలు చేసిన బయ్యర్స్ కు నిరాశే మిగిలింది. ఈ నేపధ్యంలో అల్లు శిరీష్ తన తదుపరి చిత్రం పైనే అందరి దృష్టి పడింది. అయితే శిరీష్ తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాత్రం శిరీష్ తరువాత చిత్రం కోసం ఓ ప్లాప్ డైరెక్టర్ ను ఎంచుకున్నాడట.

నితిన్ తో ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే డిజాస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్ సాయి చేతిలో అల్లు శిరీష్ ను పెట్టాడట అల్లు అరవింద్. అల్లు అరవిందే స్వయంగా తన సొంత బ్యానర్ అయిన ‘గీతా ఆర్ట్స్’ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య ఎక్కువగా ప్లాప్ డైరెక్టర్లతోనే హిట్లందుకుంటూ వస్తున్నారు అల్లు అరవింద్. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ కు అంతకు ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్టిచ్చింది కూడా అల్లు అరవిందే. ఇప్పుడు వరుస ప్లాపులతో అవకాశాలు లేకుండా పడున్న బొమ్మరిల్లు భాస్కర్ కి అఖిల్ వంటి హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ప్లాప్ డైరెక్టర్లయినప్పటికీ టాలెంటెడ్ డైరెక్టర్లనే నమ్మకం వారికి గట్టిగా ఉన్నట్టు ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus