వరుసగా సినిమాలు నిర్మించనున్న అల్లు అరవింద్

పసివాడి ప్రాణం, రౌడీ అల్లుడు, మాస్టర్, అన్నయ్య.. ఇలా మెగాస్టార్ చిరంజీవితో అనేక హిట్ సినిమాలను గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. బయటి హీరోలతోను పెళ్లి సందడి, 100% లవ్ వంటి విజయాలను అందుకున్నారు. మగ ధీర తర్వాత ఎందుకో వేగం తగ్గించారు. పదేళ్లలో పది సినిమాలను మాత్రమే చేశారు. తాజాగా గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌లో “గీతగోవిందం” సినిమా చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్టు15 న రిలీజ్ కానుంది. అయితే దీని తర్వాత అల్లు అరవింద్ వేగం పెంచినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఏడాదికి మూడు చిత్రాలని నిర్మించాలనే సంకల్పం పెట్టుకున్నట్టు వెల్లడించారు.

మొదటిగా అల్లు అర్జున్‌ తో మూవీ చేయనున్నారు. “నా పేరు సూర్య” తర్వాత హిట్ సాధించాలని మంచి కథ సెలక్షన్ లో బన్నీ ఉన్నారు. కథ ఓకే కాగానే సెట్స్ మీదకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత వరుణ్ తేజ్‌ తో చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఈ రెండు రిలీజ్ కాకముందే చిరంజీవితో ప్రాజక్ట్ పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి “సైరా” చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తర్వాత చిరు గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్ట్ చేయనున్నట్టు తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus