తేజుకి కోసం అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు ?

మెగా ఫ్యామిలీకి పెద్ద మనిషి తరహాలో అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది అల్లు అరవింద్ అనడంలో సందేహం లేదు. నిర్మాణ బాధ్యతలు దగ్గర్నుండీ… సినిమా ప్రమోషన్లు, థియేటర్లు మానేజ్మెంట్ వరకూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టేది అల్లు అరవిందే. అంతే మెగా హీరోల చేయబోయే చిత్రాల విషయంలో కూడా అల్లు అరవింద్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ ఉంటారు. రాంచరణ్, సాయి ధరమ్ తేజ్ ల కెరీర్ల విషయంలో మంచి పునాది వేసింది కూడా అల్లు అరవిందే. రాంచరణ్ కి ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ దక్కిందన్నా … అలాగే వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘ధృవ’ లాంటి సూపర్ హిట్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడన్నా.. అందులో అల్లు అరవింద్ హస్తం ఉంది. ఇక సాయి ధరమ్ తేజ్  ఎంట్రీ కూడా ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి సూపర్ హిట్ తో మొదలైందంటే అందులో కూడా అల్లు అరవింద్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే ఇప్పుడు తేజు వరుస ప్లాపులతో సతమవుతున్న తరుణంలో.. తనని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించడానికి అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.

ఇందులో భాగంగా… ఇటీవల బాలీవుడ్లో సూపర్ సూపర్ హిట్ సాధించిన రణ్ వీర్ సింగ్ కి ‘గల్లీ బాయ్’ చిత్రాన్ని సాయి ధరమ్ తేజ్ తో రీమేక్ చేసి.. బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడంట. ఇప్పటికే ఈ మేరకు రీమేక్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ‘గల్లీ బాయ్’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 4 రోజుల్లో 50 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus