అల్లు స్నేహారెడ్డి గురించి అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా అల్లు అరవింద్ స్నేహారెడ్డి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రైటర్ పద్మభూషణ్ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ప్రతిరోజూ యంగ్ యాక్టర్స్ ను కలవడంతో పాటు డైరెక్టర్లు, కొత్త టెక్నీషియన్లను కలవడం వల్లే వయస్సు పెరుగుతున్నా నేను ఇంకా ఉత్సాహంగా ఉన్నానని అల్లు అరవింద్ అన్నారు. నా ఎనర్జీ వాళ్లేనని అల్లు అరవింద్ కామెంట్ చేశారు.
రైటర్ పద్మభూషణ్ సినిమాను ఓన్ రిలీజ్ చేయడానికి మొదట నేను పెద్దగా ఆసక్తి చూపించలేదని అయితే సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయిందని ఆయన అన్నారు. ఈ సినిమాలోని అంశం నాకు నచ్చిందని అల్లు అరవింద్ తెలిపారు. ప్రతి ఆడపిల్లకు కొన్ని లక్ష్యాలు, కోరికలు ఉంటాయని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత నా భార్యను నువ్వు ఏం కావాలని అనుకున్నావని అడిగానని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.
ఆడపిల్లలు ఇంట్లో కూర్చోవడాన్ని నేను అంగీకరించనని ఆయన తెలిపారు. నా కోడలు స్నేహారెడ్డికి వాస్తవానికి పని చేయాల్సిన అవసరం లేదని అల్లు అరవింద్ అన్నారు. తను ధనవంతుల కుటుంబంలో పుట్టిందని ఆయన కామెంట్లు చేశారు. స్నేహారెడ్డి పెద్ద స్టార్ హీరోను పెళ్లాడిందని అయినప్పటికీ ఆమె తన పని తాను చేసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ అల్లు స్నేహారెడ్డి పని చేస్తోందని అల్లు అరవింద్ కామెంట్లు చేశారు.
స్నేహారెడ్డి గురించి అల్లు అరవింద్ పాజిటివ్ గా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని బన్నీ స్నేహారెడ్డి కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరిక కాగా ఈ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాల్సి ఉంది. స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.