టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో అల్లు అరవింద్, దిల్ రాజు ముందుంటారు. వీరు చిన్న హీరోలు, మిడిల్ ఆర్డర్ హీరోలతో సినిమాలు తీస్తేనే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలబెడతారు. అలాంటి ప్రొడ్యూసర్స్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఎగపడతారు. అయితే మహేష్ లాంటి స్టార్ హీరో మాత్రం ఈ ఇద్దరినీ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తూ ఉంటాడని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
దిల్ రాజు కి పట్టుదల ఎక్కువ కాబట్టి… వదలకుండా రెండు సినిమాలు తీయించుకున్నాడు(‘మహర్షి’ తో కలిపి). ఇప్పుడు మూడో సినిమాని కూడా వదలకుండా పట్టుకున్నాడు. అయితే అల్లు అరవింద్ కి మాత్రం మహేష్ ఎప్పుడూ హ్యాండ్ ఇస్తూనే ఉన్నాడు. నిజానికి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘మహేష్ 27’ ఉంటుందని చెప్పారు. అయితే కథ నచ్చలేదని మహేష్ తప్పించుకున్నాడు. కానీ మహేష్ తో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ కి కోరికట. అయినా సరే వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ కావట్లేదు.
అసలు దిల్ రాజు తో సినిమాలు చేసిన మహేష్… అల్లు అరవింద్ తో ఎందుకు చేయట్లేదు… అనే ప్రశ్నకి ఫిలింనగర్ విశ్లేషకులు కొన్ని ఆసక్తిరమైన సమాధానాలు ఇస్తున్నారు. అదేంటంటే మహేష్ కొంచెం రెమ్యూనరేషన్ ఎక్కువ చెప్పినా… దానికి దిల్ రాజు అయితే సినిమా మార్కెటింగ్ విషయాల్ని మహేష్ కి అర్థమయ్యేలా చెప్పి ఎంతో కొంత తగ్గించుకుని సినిమా చేయించుకుంటాడట. అయితే అల్లు అరవింద్ మాత్రం మహేష్ రెమ్యూనరేషన్ విషయాన్ని మేనేజ్ చేయలేడని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకోసమే కథ నచ్చలేదని మహేష్ తప్పించుకుంటాడని వారు చెబుతున్నారు. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈసారి మతం లైట్ తీసుకోవట్లేదు… ఇప్పటికే మహేష్ తో సినిమా విషయమై… నమ్రతతోనూ సంప్రదించాడట.
ఈ మేరకు మంచి కథ విషయంలో ఆయన చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా కథని మహేష్ రిజెక్ట్ చేసాడు కాబట్టి.. ఇప్పుడు ఏ దర్శకుడుతో మహేష్ ని ఒప్పించాలి అనే విషయమై అల్లు అరవింద్ ఆలోచించి..’గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరుశరామ్(బుజ్జి) అయితే ఫెరఫెక్ట్ అని భావించారట. మహేష్ కు సరపడ స్క్రిప్టును పరుశరామ్ చేత రెడీ చేయించేశారట కూడా. ఈ వారంలోనే ఈ కథ మహేష్ కి వినిపించి మహేష్ ని ఒప్పించాలని అల్లు అరవింద్ గట్టి ప్రయత్నాలే మొదలు పెట్టారు. మరి ఈ సారైనా మహేష్ ఒప్పుకుంటాడా… అంటే అనుమానమనే చెప్పాలి.