Klin Kaara: క్లిన్ కారాను ఆడిస్తున్న అర్హ.. క్యూట్ వీడియో వైరల్!

  • January 16, 2024 / 07:32 PM IST

మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లీన్ కారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించడంతో అందరికీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇలా రామ్ చరణ్ తండ్రి అవ్వడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక చిన్నారి జన్మించి దాదాపు 7 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు క్లీన్ కార ఫోటోలను మాత్రం బయటకు రివీల్ చేయలేదు.

ఇకపోతే చిన్నారి జన్మించిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో మెగా అల్లు కుటుంబ సభ్యులందరికీ కూడా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పండుగ క్లీన్ కారాకు మొదటి పండుగ కావడం విశేషం. ఈ సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలో వీడియోలను మెగా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

ఇక ఈ ఫోటోలలో కూడా క్లీన్ కారా స్పెషల్ గా నిలిచినప్పటికీ తన ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఉపాసన క్లీన్ కారాను (Klin Kaara) ఎత్తుకొని ఉండగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ తనని ఆడిస్తూ సందడి చేశారు.

ఇలా వీరిద్దరి ఆటపాటలకు సంబంధించినటువంటి వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ వీడియోకి శ్రీవల్లి పాటను జత చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మెగా అల్లు అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్హకు మంచి స్నేహితురాలు దొరికిందే అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు చాలా క్యూట్ గా ఉన్నారంటూ ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus