తన సినిమా ప్లాప్ అని ఒప్పుకున్న బన్నీ..!

సైలిష్ స్టార్ అర్జున్ కి తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాలంలో కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా… అల్లు అర్జున్ కి అక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆదరిస్తారు మలయాళ ప్రేక్షకులు. ఇక ఇటీవల మలయాలంతో పాటూ యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన భామ.. ప్రియా ప్రకాష్ వారియర్. ఈ భామ నటించిన ‘లవర్స్ డే’ చిత్ర ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు అల్లు అర్జున్.

ఇక ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ కి రావడానికి నాకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. నన్ను మలయాళంలో బాగా ఆదరిస్తున్నారు. నా ప్రతి సినిమాని వాళ్ళ సొంత సినిమా లాగ వెల్కమ్ చెప్తూనే వున్నారు. ఇక వాళ్ళ లాంగ్వేజ్‌ నుండీ తెలుగులోకి ఒక సినిమా వస్తుంది కదా…. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఈ ఆడియో వేడుకకి హాజరయ్యా. ఈ సినిమాకి ఇంత బజ్ తీసుకువచ్చిన హీరో రోషన్‌కి, ప్రియా వారియర్‌కి కంగ్రాట్స్ చెప్తున్నా. అలానే మరో కారణం చెప్పాలంటే.. నా చిత్రం ‘నా పేరు సూర్య’ టైంలో వినోద్ రెడ్డి అనే నిర్మాతని పరిచయం చేశాడు బన్నీ వాసు. అయితే ఈ చిత్రం వల్ల నిర్మాతకు చాలా నష్టాలొచ్చాయి. తరువాత సెటిల్ మెంట్‌ల టైంలో బన్నీ వాసు వచ్చి వినోద్ రెడ్డి సినిమా ముందు ఎలా ఉన్నాడో… తరువాత కూడా అలానే ఉన్నాడని చెప్పాడు. నేను బన్నీ వాసుకి చెప్పా… మనకు టైం వచ్చినప్పుడు ఆయనకు ఏమైనా చేయాలి గుర్తుపెట్టుకో అని..! ఇప్పుడు వినోద్ రెడ్డి వచ్చి ఈ సినిమా ఫంక్షన్‌కి ఆహ్వానించారు. నా ప్రాణం ఉన్నంత వరకూ ఇలాంటి వాళ్ళ కోసం నిలబడతా…! నా ఫ్యాన్స్ ని నేను వదులుకోను.. నా ఫ్యాన్స్ ని పోగొట్టుకోవడం నాకస్సలు ఇష్టం లేదు..” అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.

ఇక్కడ రెండు విషయాల్లో అల్లు అర్జున్ ని కచ్చితంగా అభినందించాలి. మొదటగా తన చిత్రం ప్లాప్ అని డైరెక్ట్ గా స్టేజి పై అంగీకరించి… ఆ చిత్రానికి నష్టాలు వచ్చాయి అని చెప్పడం అయితే.. మరొకటి… తన చిత్రం వలన నష్టపోయిన తన నిర్మాతకి ఎప్పుడైనా అండగా నిలబడాలి.. తన కోసం ఏదైనా చేయాలి… అని ముందుకొచ్చి తనని అభిమానించేవాళ్ళని వదులుకోను అని చెప్పడం… నిజంగా బన్నీలో ఉండే గొప్ప గుణం అని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కూడా తన చిత్రం ‘వరుడు’ ప్లాప్ అయ్యిందని… గుణశేఖర్ ‘రుద్రమదేవి’ అనే చిత్రంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ‘గోన గన్నారెడ్డి’ అనే పాత్రని చేసి.. ఆ చిత్రాన్ని ఆదుకున్నాడు బన్నీ. ఇప్పుడు వినోద్ రెడ్డి విషయంలో మరోసారి తన గొప్ప మనసు చాటుకోవడం విశేషం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus