నా పేరు సూర్య ఆడియో వేడుకలో పవన్ గురించి స్పందించిన అల్లు అర్జున్!

ఎప్పుడో రెండేళ్ల క్రితం “సరైనోడు” ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” అన్నాడు అనే విషయాన్ని పట్టుకొని నిన్నమొన్నటివరకూ బన్నీని “కన్నీ” అంటూ వేర్వేరు పేర్లు పెట్టి పిలిచినవాళ్లందరికీ మొన్న పవన్ కళ్యాణ్ కి తోడుగా, అండగా ఫిలిమ్ ఛాంబర్ కి వచ్చి తన ప్రేమను ఫిలిమ్ నగర్ సాక్షిగా ప్రూవ్ చేసుకొని తనను యాంటీ పవన్ కళ్యాణ్ అన్న వాళ్లందరి నోర్లూ ఒకేసారి మూయించాడు. ఇక నిన్న సాయంత్రం వెస్ట్ గోదావరికి చెందిన మిలటరీ మాధవరం గ్రామంలో అత్యంత ఘనంగా నిర్వహించబడిన “నా పేరు సూర్య” ఆడియో విడుదల మరియు ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి మరోమారు స్పందించి పవన్ కళ్యాణ్ మీద తనకున్న అమితమైన ప్రేమను ఘనంగా చాటుకొన్నాడు అల్లు అర్జున్.

ఆడియో విడుదల వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఈమధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. “ప్రజారాజ్యం” టైమ్ లోనే చిరంజీవి గారి గురించి చాలా చెడుగా వినాల్సి వచ్చింది. అప్పుడే ఈ మనసు గట్టిబడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మీద విమర్శలు, వ్యక్తిగత విమర్శలు మొదలయ్యాయి. అయితే.. రీసెంట్ గా మాత్రం చాలా అసహ్యంగా ప్రవర్తించారు. ఆయనేమీ హీరోగా ఫేడవుట్ అయ్యాక రాజకీయాల్లోకి వెళ్లలేదు, కోట్ల రూపాయల డబ్బు, స్టార్ డమ్, ఇండస్ట్రీలో నెం.1 పొజిషన్ ను వదులుకొని మరీ ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ముఖ్యంగా ఎవడు పడితే వాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఖర్మ అని వదిలేస్తున్నాం. కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను” అన్నారు. అదే సందర్భంలో తన తమ్ముడు రామ్ చరణ్ కి “రంగస్థలం”తో సూపర్ హిట్ కట్టబెట్టిన మెగా అభిమానులందరికీ కూడా అల్లు అర్జున్ కృతజ్ణతలు తెలపడం మెగా అభిమానుల్ని అలరించింది. దాంతోపాటు.. నిన్నమొన్నటివరకూ రెండుగా చీలిపోయిన మెగా అభిమానులని కూడా ఏకం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus