అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ రిలీజ్ కి ఇంకా రెండు నెలలు ఉండగానే రికార్డుల వేట మొదలైంది. అల్లు అర్జున్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రైటర్ టర్నడ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తుండగా.. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన సెక్సీ బ్యూటీ అను ఎమ్మాన్యూల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27న విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం శాటిలైట్స్ బిజినెస్ డీల్ నిన్న ముగిసింది. దాదాపు 24 కోట్ల రూపాయలకి “నా పేరు సూర్య” శాటిలైట్ రైట్స్ (తెలుగు మరియు హిందీ డబ్బింగ్) ను జీ సంస్థ కొనుగోలు చేసింది. ఇదివరకంటే అల్లు అర్జున్ సినిమాల రికార్డ్స్ అన్నీ డైరెక్టర్ ఖాతాలో పడిపోయేవి.. అయితే “నా పేరు సూర్య” డైరెక్టర్ వక్కంతం వంశీ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాకి సంబంధించిన హోల్ క్రెడిట్ అల్లు అర్జున్ కే చెందుతుంది. అల్లు అర్జున్ మునుపటి చిత్రం “సరైనోడు” సినిమా డబ్ వెర్షన్ యూట్యూబ్ లో క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు.
ఇకపోతే.. విడుదలైన “నా పేరు సూర్య” ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు. యాంగ్రీ యంగ్ ఆర్మీ మేజర్ గా అల్లు అర్జున్ ఈ చిత్రంలో తన నటనతో మెప్పించనున్నాడట. “నా పేరు సూర్య’తో పోటీకి వచ్చిన మహేష్ బాబు “భరత్ అనే నేను” రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అల్లు అర్జున్ “నా పేరు సూర్య”కి మార్చి లో సోలో రిలీజ్ దొరికేలా ఉంది. రిలీజ్ కి ముందే ఈస్థాయిలో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.