Allu Arjun: ఆ విషయంలో బన్నీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా..?

2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పుష్ప సినిమా టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. ఈ ఏడాది ఆగష్టు 13వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ కానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆలస్యమైతే మాత్రం రిలీజ్ డేట్ లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఈ సినిమా తరువాత బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో నటించాల్సి ఉండగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతోంది. అయితే కొరటాల శివ తన ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ కు షిప్ట్ చేయడంపై బన్నీ ఆగ్రహంగా ఉన్నారని, బన్నీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా..? ఉండదా..? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్న యువసుధ సంస్థ 2022 ఏప్రిల్ తరువాత బన్నీ కొరటాల శివ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ట్వీట్ చేసినా కొరటాల శివ ఆ ట్వీట్ ను లైక్ చేయడం కానీ రీట్వీట్ చేయడం కానీ చేయలేదు. పుష్ప సినిమా రిలీజైతే మాత్రమే బన్నీ కొరటాల శివ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా 2022 సంవత్సరం ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది. సలార్ విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus